కెటీఆర్ సీఎం కావాలని భగవంతుడిని కోరుకున్నా
BY Telugu Gateway22 Aug 2020 12:52 PM IST

X
Telugu Gateway22 Aug 2020 12:52 PM IST
గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు..ఎమ్మెల్యేలు కెటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వరస పెట్టి ప్రకటనలు చేస్తున్నారు. ఆయన తప్ప సీఎం అభ్యర్ధికి అర్హుడు ఎవరు ఉన్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ తర్వాత ఆయనే అంటూ చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా చేరారు.
ఆయన శనివారం నాడు ఖైరతాబాద్ లోని దన్వంతరి రూపంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పేంటి?. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతున్ని కోరుకున్నా’ అని వ్యాఖ్యానించారు.
Next Story



