Telugu Gateway
Politics

లక్షల సవాళ్లు ఉన్నా..కోట్ల పరిష్కారాలు వస్తాయి

లక్షల సవాళ్లు ఉన్నా..కోట్ల పరిష్కారాలు వస్తాయి
X

ఆన్ లైన్ లో ప్రతి ఒక్కరి ‘ఆరోగ్యచరిత్ర’

అతి త్వరలోనే వ్యాక్సిన్

ఒక్క క్లిక్. ఒకే ఒక్క క్లిక్ తో ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్ర వెల్లడికానుంది. ఈ దిశగా కేంద్రం ప్రతిష్టాత్మక పథకం ప్రవేశపెడుతోంది. ఈ విషయాన్ని స్వాత్రంత్ర దినోవ్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ వెల్లడించారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమం తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్య గుర్తింపు కార్డు పొందనున్నారు. ఇది దేశ వైద్య రంగంలో విప్లవం వంటిదని మోడీ పేర్కొన్నారు. దీంతో ప్రతి పౌరుడి ఆరోగ్య చరిత్ర ఆన్ లైన్ లోకి చేరనుంది. సంబంధిత వ్యక్తికి ఎప్పుడు ఏ టెస్ట్ లు చేశారు..ఏ డాక్టర్ ఏ మందు ఇచ్చారు..పరీక్షల నివేదికల్లో ఏముంది అన్న సమాచారం మొత్తం డిజిటలైజ్ కానుంది. ఆత్మనిర్భర భారత్ కు సంబంధించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ స్వయంసమృద్ధి శక్తిగా అవతరించటానికి లక్షల సవాళ్లు ఉంటాయని..కానీ వీటికి కోట్లాది పరిష్కారాలు చూపే శక్తి దేశానికి ఉందన్నారు.

ప్రస్తుతం భారత్ ఇతర దేశాలకు సాయం చేసే స్థాయికి చేరుకుందన్నారు. దీంతో పాటు దేశాన్ని..ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ సమస్య గురించి కూడా మోడీ ప్రస్తావించారు. భారత్ లో మూడు వ్యాక్సిన్ లు ప్రయోగాల దశలో ఉన్నాయని..శాస్త్రవేత్తలు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు. అతి తక్కువ సమయంలో ప్రతి ఒక్క భారతీయుడికి కోవిడ్ 19 వ్యాక్సిన్ చేరేలా చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాబోయే వెయ్యి రోజుల్లో ఆరు లక్షల గ్రామాలు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను పొందనున్నాయని వెల్లడించారు.

2014కు ముందు అతి తక్కువ గ్రామ పంచాయతీలకు మాత్రమే ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్స్ ఉన్నాయని..గత ఐదేళ్ళలో 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు వీటితో అనుసంధానం అయ్యాయని తెలిపారు. భారతీయులు ఒకసారి ఒక పనిచేయాలని నిర్ణయించుకుంటే.అది సాధించే వరకూ విశ్రమించరని పేర్కొన్నారు. గత దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) రికార్డు స్థాయిలో 18 శాతం మేర పెరిగాయన్నారు. ఇది అన్ని రికార్డులను అధిగమించిందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించటంతోపాటు యువత తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు దోహదపడగలదని తెలిపారు.

Next Story
Share it