Telugu Gateway
Politics

తెలంగాణ అసలు ముఖ్యమంత్రి కెటీఆరే

తెలంగాణ అసలు ముఖ్యమంత్రి కెటీఆరే
X

సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి కెటీఆరే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ విశ్రాంతి తీసుకుని కెటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలన్నారు. నారాయణ గురువారం నాడు వరంగల్ లో పర్యటించి వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.

టీఆర్ఎస్ నేతల ఆశీస్సులతోనే రాష్ట్రంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాలాలు ఆక్రమించటం వల్లే వరద ముంపు ఏర్పడిందని అన్నారు. జిల్లాకు తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించాలని నారాయణ డిమాండ్ చేశారు.

Next Story
Share it