ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర గత సందడి మిస్

హైదరాబాద్ లో వినాయకచవితి అంటే సందడి అంతా ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల వద్దే ఉంటుంది. బాలాపూర్ కంటే కూడా ఖైరతాబాద్ వినాయకుడికే ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. ప్రతి ఏటా ఇక్కడ అతి పెద్ద విగ్రహాం ఏర్పాటు చేయటం అనవాయితీ. కానీ సారి కరోనా దెబ్బ కారణంగా విగ్రహాం తొమ్మిది అడుగులకే పరిమితం అయింది. భక్తులను అనుమతించేదిలేదని పోలీసులు చెబుతున్నారు. అయినా భక్తులు శనివారం ఉదయం నుంచి గుంపులు గుంపులుగా విగ్రహం వద్దకు చేరుకుంటున్నారు. ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ప్రత్యేకంగా తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రసాదం గణపతి చేతిలో కొలువుదీరింది.
స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని తొలిసారి పూజ నిర్వహించారు. పది కిలోల వెండిని గణపతికి బహుకరించారు. ఆన్‌లైన్లో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మామూలుగా అయితే వినాయకచవితి వచ్చింది అంటే ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్టించే ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి..పోలీసులు 24 గంటల పాటు విధులు నిర్వహించేవారు. కానీ ఈ సారి అలాంటి హంగామా ఏమీ లేదు. భక్తులు కూడా దేవాలయాలకు వెళ్లటానికి కూడా సాహసించని పరిస్థితుల్లో పెద్దగా రాకపోవచ్చనే అంచనాతో ఉన్నారు.



