కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా
BY Telugu Gateway2 Aug 2020 4:59 PM IST

X
Telugu Gateway2 Aug 2020 4:59 PM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారినపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో కరోనా బారిన పడిన తొలి మంత్రి కూడా ఆయనే. తాను కరోనా బారిన పడిన విషయాన్ని అమిత్ షా స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తన ఆరోగ్యం అంతా బాగానే ఉందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే కరోనా చికిత్స కోసం అమిత్ షా ఆస్పత్రిలో చేరే అవకాశం ఉందని సమాచారం. తనను కలసి వారంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అమిత్ షా సూచించారు.గత కొన్ని రోజులుగా అమిత్ షా పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. దీంతో ఇప్పుడు అందులో పాల్గొన్న అధికారులు అందరూ ఒకింత ఆందోళనలో ఉన్నారు. అయితే వీరంతా ఇప్పుడు హోం క్వారంటైన్ లో ఉండటంతో ఏ మాత్రం లక్షణాలు ఉన్నా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
Next Story



