హర్యానా సీఎంకు కరోనా
BY Telugu Gateway24 Aug 2020 7:52 PM IST
X
Telugu Gateway24 Aug 2020 7:52 PM IST
దేశంలో కరోనా కేసుల సంఖ్య జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతవారం రోజుల్లో సీఎంను నేరుగా భేటీ అయిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు.
Next Story