Telugu Gateway
Cinema

అదరగొట్టిన కీర్తిసురేష్

అదరగొట్టిన కీర్తిసురేష్
X

పాత్ర ఏదైనా అందులో సారాన్ని ఇట్టే ఒడిసిపట్టుకోవటం కీర్తిసురేష్ సొంతం. ఆమె సినిమాలు చూసిన వారెవరైనా ఈ నిజం ఒప్పుకోక తప్పదు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రకు ప్రాణం పోసింది కీర్తిసురేష్. ఆ నడక..ఆ మాట తీరు చూసి ఔరా అనుకోవాల్సిందే. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘గుడ్ లక్ సఖి’ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, కీర్తి సురేష్, జగపతిబాబులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఏ మాత్రం అదృష్టం లేని ఓ పల్లెటూరి అమ్మాయి రైఫిల్ షూటింగ్ లో ఎలా నైపుణ్యం సాధించింది.. బ్యాడ్ లక్ సఖి..గుడ్ లక్ సఖిగా ఎలా మారింది అన్నదే ఈ సినిమా అన్న విషయం టీజర్ లోనే చూపించారు. నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేస్ ని జాతీయ షూటర్‌గా తయారు చేసే కోచ్‌గా జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. టీజర్‌లో కీర్తి సురేశ్‌ డైలాగ్‌ డెలివరీ ఆకట్టుకుంటుంది.

https://www.youtube.com/watch?time_continue=58&v=rjBv3K5FMoU&feature=emb_logo

Next Story
Share it