Telugu Gateway
Politics

దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 17100 కోట్లు

దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 17100 కోట్లు
X

పీఎం కిసాన్ పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 17100 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. 8.5 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. ఒక్కో రైతుకు కేంద్రం నేరుగా ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఈ నిధులను ప్రధాని నరేంద్రమోడీ ఎలక్ట్రానిక్ విధానం ద్వారా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఒక్క క్లిక్ తో ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతున్నాయి.

2018లో ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత జమ చేసిన ఆరవ ఇన్ స్టాల్ మెంట్ ఇది. నేరుగా ఈ పథకం ద్వారా ఏటా 90000 కోట్ల రూపాయలు అందనున్నాయి. ఆధార్ తో అనుసంధానం చేసి మరీ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీని ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2019 నవంబర్ మధ్య కాలంలో ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

Next Story
Share it