Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు
X

ఈ ఏడాది మేలో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో వైసీపీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజధాని వికేంద్రీకరణపై టీడీపీతో విభేదించిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా టీడీపీ వ్యతిరేకించటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Next Story
Share it