ధోనీ లోక్ సభ బరిలో దిగాలి
BY Telugu Gateway16 Aug 2020 11:48 AM IST

X
Telugu Gateway16 Aug 2020 11:48 AM IST
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక సూచన చేశారు. ధోనీ 2024 ఎన్నికల్లో లోక్ సభ బరిలో దిగాలని స్వామి సూచించారు. ధోని క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నారు తప్ప...అన్నింటి నుంచి కాదన్నారు. కష్టాలను ఎదుర్కొకోవటంలో ఎంతో టాలెంట్ చూపించారని..బారత క్రికెట్ టీమ్ కు స్పూర్తిదాయక నాయకత్వం వహించారని స్వామి కొనియాడారు.
ప్రజా జీవితంలోనూ ధోనీ ఇలాగే వ్యవహరించాలంటూ ట్వీట్ చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ ఈ ప్రతిపాదనపై స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే. ఎప్పటి నుంచో ధోనీ బిజెపిలో చేరతారని ప్రచారం బలంగా ఉంది. ఈ తరుణంలో స్వామి బహిరంగంగా ఈ ప్రతిపాదన చేయటం ఆసక్తికర పరిణామమే.
Next Story