Telugu Gateway
Politics

కరాచీలోనే దావూద్..పాక్ జాబితాలో చోటు

కరాచీలోనే దావూద్..పాక్ జాబితాలో చోటు
X

తొలి సారి పాకిస్థాన్ నిజం అంగీకరించింది. భారత్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నట్లు ఒప్పుకుంది. అంతే కాదు..అధికారికంగా విడుదల చేసిన జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరు కూడా పొందుపర్చింది. దావూద్ తోపాటు పాక్ లో తలదాచుకున్న టెర్రరిస్టుల పేర్లతో ఇమ్రాన్ సర్కారు ఓ జాబితాను విడుదల చేసింది. అందులో హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్, ముల్లా ఫజరుల్లా, జాకిర్ ఉర్ రెహమాన్ లఖ్వి, నూర్ వాల్ మెహసూద్, ఫజల్ రహీం, జలాలుద్దీన్ హక్కానీ, ఖలీల్ అహ్మద్ హక్కానీ, యాయా హక్కానీ, సరాజుద్దీన్ హక్కానీ లు ఉన్నారు. భారత్ ఎప్పటి నుంచో దావూద్ ఇబ్రహీంకు పాక్ ఆశ్రయం కల్పిస్తోందని..దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పినా ఇంత కాలం పాక్ బుకాయిస్తూ వచ్చింది.. కానీ ఇప్పుడు ఆర్ధిక ఆంక్షలను తప్పించుకునేందుకు నిజాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురైంది.

Next Story
Share it