Telugu Gateway
Cinema

చిరు పుట్టిన రోజు కోసం కామన్ డీపీ

చిరు పుట్టిన రోజు కోసం కామన్ డీపీ
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన తనయుడు, హీరో రామ్ చరణ్ కామన్ డీపీని విడుదల చేశారు. ఈ డీపీలో చిరంజీవి కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన చిత్రాలకు చెందిన కొన్ని ఫోటోలను ఉంచారు. దీంతోపాటు కరోనా సమస్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో ప్రజలకు ఓ సందేశం ఇచ్చేలా ప్లాస్మాను దానం చేయండి..ప్రాణాలు కాపాడండి అనే నినాదాన్ని కూడా జత చేశారు.

ఈ అంశంలో చిరంజీవి ఇప్పటికే నగర పోలీసులతో కలసి ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. శనివారం నాడు చిరంజీవి 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన చిత్రం ‘ఆచార్య’ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా అందించనున్నారు. డీపీతోపాటు ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

https://www.youtube.com/watch?time_continue=2&v=MlT-D5c1Y0U&feature=emb_logo

Next Story
Share it