Telugu Gateway
Politics

ప్రధానికి లేఖ రాస్తే డీజీపీ స్పందిస్తారా?

ప్రధానికి లేఖ రాస్తే డీజీపీ స్పందిస్తారా?
X

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అంశంలో ఏపీ డీజీపీ రాసిన లేఖపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధాని మోడీకి లేఖ రాస్తే అంత ఆగమేఘాల మీద డీజీపీ లేఖ రాయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ట్యాపింగ్ ఆధారాలు ఇవ్వాలని అడగటం విడ్డూరమన్నారు. ప్రతిపక్షాల నాయకులపై దాడులు, తప్పుడు కేసులపై గతంలో ఇచ్చిన వినతులు, రాసిన లేఖలపై డిజిపి ఏం చర్యలు తీసుకున్నారు..? మీరు చేయాల్సింది చేయకుండా, నాకు లేఖలు రాయడం హాస్యాస్పదం.

నా విశాఖ పర్యటన అడ్డుకుంటే ఈయన ఏం చేశారు..? ముందు అనుమతి ఇచ్చి, తీరా విశాఖ వెళ్లాక నన్ను ఆపడం ఏమిటి..? ఆత్మకూరుకు నన్ను వెళ్లనీకుండా ఇంటి గేట్లకు తాళ్లు కట్టి అడ్డుకున్నారు. కోర్టులో నిలబడి చట్టం చదవాల్సిన పరిస్థితులు డిజిపి ఎందుకు తెచ్చుకున్నారు..? ఇప్పుడు సాక్ష్యాధారాలు ఇవ్వాలని డిజిపి లేఖ రాయడం కన్నా విడ్డూరం మరొకటి లేదు. ఫోన్ ట్యాపింగ్ వైసిపికి ముందునుంచి ఉన్న అలవాటే..గతంలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర వీళ్లది అంటూ విమర్శించారు.

Next Story
Share it