Telugu Gateway
Cinema

బాలీవుడ్ లో ‘కొకైన్ పాపులర్ డ్రగ్’

బాలీవుడ్ లో ‘కొకైన్ పాపులర్ డ్రగ్’
X

ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొకైన్ చాలా పాపులర్ డ్రగ్ అని ట్వీట్ చేశారు. పరిశ్రమకు సంబంధించి ప్రతి ఇంట్లో జరిగే పార్టీల్లో ఇది ఉంటుందని పేర్కొన్నారు.ప్రారంభంలో ఉన్నతమైన, శక్తివంతమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉచితంగానే ఇది దొరుకుతుందని తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మిస్టరీ మృతికి సంబంధించిన అంశంపై తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) ప్రవేశించిన సందర్భంలో ఆమె తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..తాను ఎన్ సీబీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని..అయితే తనకు రక్షణ కల్పించాలని ట్వీట్ లో పేర్కొన్నారు.

తాను కెరీర్ నే కాదు...జీవితాన్నే రిస్క్ లో పెడుతున్నానని పేర్కొన్నారు. సుశాంత్ కు ఇలాంటి మురికి రహస్యాలు ఎన్నో తెలుసని అందుకే అతన్ని హత్య చేశారని తెలిపారు. బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామే తొలుత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన రోజు డ్రగ్ డీలర్ ఆయనతో సమావేశం అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు.. ఆ తర్వాత డ్రగ్ వాడకానికి సంబంధించి రియా వాట్సప్ చాట్ సంభాషణల వ్యవహారం ఈ అనుమానాలను మరింత బలోపేతం చేసినట్లు అయింది. దీంతో ఈ వ్యవహారం గంట గంటకూ కొత్త మలుపులు తిరుగుతోంది.

Next Story
Share it