కెసీఆర్ జైలుకెళ్ళక తప్పదు
BY Telugu Gateway30 Aug 2020 5:18 PM IST

X
Telugu Gateway30 Aug 2020 5:18 PM IST
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం డేగ కన్నుతో నిఘా పెట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో సీఎం కెసీఆర్ జైలుకు వెళ్లకతప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందని సంజయ్ ఆరోపించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని దుయ్యబట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు.
గవర్నర్ కరోనాకు సంబంధించి సూచనలు చేస్తే కూడా ఆమె రాజకీయ విమర్శలు చేశారని దుయ్యబట్టారు. పలు అంశాలపై గవర్నర్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారన్నారు. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అగ్రహం వ్యక్తం చేశారు.
Next Story



