అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు..హైకోర్టులో పిటీషన్

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై ఆయనపై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని వైసీపీ కార్యకర్తలు పిటిషన్ వేశారు. కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కు , సీఎం జగన్‌కు పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది.
అయితే ఈ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి విచారణ జరపాలని ఆదేశించినా పట్టించుకోలేదని న్యాయవాది తెలిపారు. అక్రమ మైనింగ్‌పై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. కేసు వచ్చే నెలకు వాయిదా వేసింది. తాము పక్కా ఆధారాలతోనే కేసు వేశామని..తాము సమర్పించిన ఆధారాలు తప్పని తేలితే శిక్షకు కూడా సిద్ధమని పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు.