Telugu Gateway
Cinema

సమ్మర్ లో చిరంజీవి ‘ఆచార్య’ సందడి

సమ్మర్ లో చిరంజీవి ‘ఆచార్య’ సందడి
X

ఫస్ట్ లుక్ తోపాటే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’ విడుదల కూడా ఎప్పుడో చెప్పేసింది చిత్ర యూనిట్. 2021 సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ముందు ప్రకటించినట్లుగానే చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ సినిమా ఫస్ట్ లుక్ తోపాటు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తొలిసారి కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నారు. ఇది చిరు 152వ చిత్రం అన్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ప్రచారం జరిగినట్లు ఈ సినిమా దేవాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాటంతో సాగే కథే అన్నది ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతోంది. నిర్మాత, హీరో రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆచార్యకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్ని సినిమాల తరహాలోనే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేకులు పడ్డాయి. పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉంది.

https://www.youtube.com/watch?time_continue=54&v=vQ3cW6EJu1E&feature=emb_logo

Next Story
Share it