Telugu Gateway
Politics

ఎఎఐ అంటే అదానీ ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా

ఎఎఐ అంటే అదానీ ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా
X

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ దేశంలో విమానాశ్రయాల ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్, లక్నో, మంగుళూరు విమానాశ్రయాలను అమ్మేశారు. ఇప్పుడు జైపూర్, గౌహాతీ, తిరువనంతపురం విమానాశ్రయాల వంతు వచ్చింది. ఆరు విమానాశ్రయాలను ఒకే ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారు. దీంతో ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) కాస్తా ఇప్పుడు అదానీ ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని ట్వీట్ చేశారు జైరాం రమేష్.

కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తిరువనంతపురం విమానాశ్రయం ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. అదానీ గ్రూప్ ఈ విమానాశ్రయం కోసం ఏర్పాటు చేసిన అదానీ త్రివేండ్రం ఇంటర్నేషనల్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అదానీ కొంత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం నాడు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మూడు విమానాశ్రయాలను అదానీ గ్రూపు అప్పగించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story
Share it