Telugu Gateway
Andhra Pradesh

రాజధాని తరలింపును ఉద్యోగులు వ్యతిరేకించటంలేదు

రాజధాని తరలింపును ఉద్యోగులు వ్యతిరేకించటంలేదు
X

అమరావతి నుంచి రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించటంలేదని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని, రాజధాని తరలింపు కు అయ్యే ఖర్చు 70 కోట్ల మాత్రమేనని తెలిపారు. రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీడ్‌ పిటిషన్‌ను వేశారు. ఈ మేరకు పిటిషన్‌లో రాష్ట్ర రాజధాని అనేది భూములు ఇచ్చిన రైతులు సొంత వ్యవహారం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు అని పేర్కొన్నారు.

‘రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే కానీ రైతులు కాదు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూకేటాయింపులు జరిగాయి. అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతుంది. అమరావతి రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయనడం పూర్తిగా అవాస్తవం. కొందరి రాజకీయ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే పిటిషన్ వేశారు. ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజన ప్రజాప్రయోజనాలు లేవు.’ అని తమ పిటీషన్ లో పేర్కొన్నారు.

Next Story
Share it