సచివాలయం కూల్చివేత కేసు వాయిదా

సచివాలయం కూల్చివేతపై స్టే గురువారం వరకూ కొనసాగనుంది. ఈ అంశంపై బుధవారం నాడు కూడా హైకోర్టులో వాదనలు సాగాయి. ముఖ్యంగా సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతి తీసుకున్నారా? లేదా అన్న అంశంపై వాదనలు సాగాయి. అయితే ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణ సమయంలోనే ఈ అనుమతి అవసరం అని..కూల్చివేతకు అక్కర్లేదని తెలిపారు. అయితే పిటీషనర్ తరపు లాయార్ మాత్రం కూల్చివేతకు ముందు పర్యావరణ అనుమతి తీసుకోలేదని తెలిపారు.
అయితే ప్రభుత్వం ఆ అవసరం లేదని..ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు ఉన్నాయని..వాటిని కోర్టు దృష్టికి తీసుకొస్తామని తెలిపారు. దీంతో కేసు గురువారానికి వాయిదా పడింది. ప్రభుత్వ వాదనకు తాము కూడా సమాధానం ఇస్తామని పిటీషనర్ తరపు లాయర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018 కి విరుద్దంగా కూల్చివేత పనులు చేపడుతున్నారన్న పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.