Telugu Gateway
Politics

ఢిల్లీ..ఏపీ తరహాలో తెలంగాణలోనూ టెస్ట్ లు చేయాలి

ఢిల్లీ..ఏపీ తరహాలో తెలంగాణలోనూ టెస్ట్ లు చేయాలి
X

తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తరహాలో తెలంగాణలో కరోనా పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కిషన్ రెడ్డి బుధవారం నాడు ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రం ఏడు లక్షల పధ్నాలుగు వేల ఎన్ -95 మాస్కులను, రెండు లక్షల 41 వేల పీపీఈ కిట్లను అందించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మొత్తం 1220 వెంటిలేటర్స్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఇప్పటికే 688 వెంటిలేటర్స్ తెలంగాణకు చేరాయన్నారు. ఢిల్లీ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండేది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధిక సంఖ్యలో టెస్టుల చేయడం, తో పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో ఏ రకంగా కరోనా ను అరికట్టాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవాలి.

వాళ్లకు పూర్తి సహకారం కేంద్రం అందిస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్వయంగా చెప్పారని తెలిపారు. హైదరాబాద్ ప్రజలలో ఈరోజు భయం, ఆందోళన ఉన్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ముఖ్యమంత్రి యుద్ద ప్రాతిపదికన కరోనా ను నివారించే, అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయం లో కేంద్రం పూర్తిగా సహకరి స్తుందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లలో లక్షల్లో ఫీజులు వసూలు చెయ్యడం మీద కూడా దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి కోరారు. ఢిల్లీ తరహాలో పదివేల పడకల ఆసుపత్రిని ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందున్న ముఖ్య అంశం రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడం. ప్రస్తుతానికి మిగతా విషయాలు పక్కన పెట్టి ఈ అంశం పైన అధిక దృష్టి పెట్టాలని కోరారు.

Next Story
Share it