Telugu Gateway
Telangana

ఇంటర్ ఫెయిలైన వారంతా పాస్

ఇంటర్ ఫెయిలైన వారంతా పాస్
X

ఈ ఏడాది మార్చిలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్ధులు అందరూ పరీక్షలు లేకుండానే పాస్ అయిపోయినట్లే లెక్క. దీనికి కారణం. తెలంగాణ సర్కారు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయం తీసుకున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా విద్యార్ధుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకన్నట్లు వెల్లడించారు.

పరీక్షలు రాయకుండానే పాస్ అవుతున్న వారంతా కంపార్ట్ మెంటల్ లో పాస్ అయినట్లు మార్కుల జాబితాలో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 1.47 లక్షల మంది విద్యార్ధులు ప్రయోజనం పొందనున్నారు. వీరంతా మార్కుల జాబితాను జులై 31 తర్వాత సంబంధిత కళాశాల్లో పొందవచ్చని తెలిపారు మార్కుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల ఫలితాలను పది రోజుల తర్వాత అందజేస్తామని తెలిపారు.

Next Story
Share it