Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు అసంతృప్తి
X

కరోనా కేసుల అంశంలో తమ ఆదేశాలు ఏమీ అమలు కావటంలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జూన్ 8 నుంచి తాము ఇచ్చిన ఆదేశాలు ఏవీ అమలు కాలేదని..వాటి అమలు సాధ్యంకాకపోతే ఎందుకు కాదో చెప్పాలన్నారు. ఈ విషయాన్ని మంగళవారం నాడు సీఎస్ నే అడుగుతామని పేర్కొంది. తమ ఆదేశాలు పట్టించుకోకపోవటం దురదృష్టకరం అని పేర్కొంది. ఆదివారం నాడు విడుదల చేసి బులెటిన్ లోనూ పూర్తి వివరాలు లేవన్నారు.

కరోనా కేసులు అన్నింటిపై మంగళవారం నాడు విచారించనున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా కరోనా విషయంలో తెలంగాణ సర్కారు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపడుతోంది. అయినా సరే సర్కారు మాత్రం తాము ఎంతో కష్టపడి పనిచేస్తుంటే పిల్స్ ను స్వీకరిస్తూ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. సాక్ష్యాత్తూ సీఎం దగ్గర జరిగిన సమీక్షలో అధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it