Telugu Gateway
Politics

అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్

అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్
X

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఎంపీ విమర్శలపై చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లు మీడియాతో మాట్లాడారు. 2020 ఉత్తమ జోకర్ దర్మపురి అరవింద్ అని నరేందర్ ఎద్దేవా చేశారు. తాను గజం భూమి కబ్జా చేసినట్టు ఆదారాలతో రుజువు చేస్తే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని..? రుజువు చేయలేకపోతే రాజీనామాకు అతను సిద్దమా అని ప్రశ్నించారు. దొంగ సర్టిఫికెట్ లు పెట్టి ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తి మాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. రాజస్థాన్ యూనివర్సిటీలో దొంగ సర్టిఫికెట్ లు తెచ్చి ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ ప్రజలను మోసం చేసిన వ్యక్తి నీతులు వల్లిస్తున్నాడు.

విశ్వతనీయత లేని వారి వాఖ్యలకు విలువుండదు. పసుపు బోర్డు పేరు చెప్పి నిజామాబాద్ లో గెలిచి ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం,ప్రజాప్రతినిదులపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. స్మార్ట్ సిటీ నిదుల దుర్వినియోగం జరగలేదు. అవగాహణ లేని వ్యక్తి దర్మపురి అరవింద్..నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అతనికి అలవాటు..కలెక్టర్ కు లేఖ రాస్తావో..ఆర్టీఐ లో అప్లికేషన్ పెట్టుకుంటావో నీ ఇష్టం.అవగాహనతో మాట్లాడు. దొంగ సర్టిఫికెట్ తో వచ్చినోళ్ళకు ఇంతకు మించి ఏ జ్ఞానం ఉంటుంది. రైతులను నమ్మించి మోసం చేసి ఎంపిగా గెలిచిన వ్యక్తి దర్మపురి అరవింద్..భవిష్యత్ లో నీకు వారే తగిన బుద్ది చెబుతారు’ అని విమర్శించారు.

Next Story
Share it