Telugu Gateway
Telangana

తెలంగాణలో 1850..జీహెచ్ఎంసీలో 1572 కేసులు

తెలంగాణలో 1850..జీహెచ్ఎంసీలో 1572 కేసులు
X

తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇటీవల వరకూ జీహెచ్ఎంసీ పరిధిలో వెయ్యి లోపు నమోదు అయిన కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. పరీక్షల సంఖ్య పెరిగితే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో కొత్తగా 1850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క జీహెచ్ఎంసీలోననే 1572 కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఐదుగురు చనిపోయారు. దీంతో తెలంగాణలో కరోనా కారణంతో మరణించిన వారి సంఖ్య మొత్తం 288కి పెరిగింది.

రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22312కు పెరిగింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10487గా ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 1572, రంగారెడ్డిలో 92, మేడ్చెల్ లో 53, కరీంనగర్ లో 18, వరంగల్ అర్బన్ లో 31, నల్గొండలో 10, నిజామాబాద్ లో 17 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 1342 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 11 537 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్ళకు వెళ్లినట్లు అయింది. గత 24 గంటల్లో మొత్తం 6427 శాంపిళ్లను పరీక్షించారు.

Next Story
Share it