Telugu Gateway
Politics

తెలంగాణ గవర్నర్ తో సీఎస్ భేటీ

తెలంగాణ గవర్నర్ తో సీఎస్ భేటీ
X

తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి భేటీ అయ్యారు. తెలంగాణలో కరోనా పరిస్థితిపై వీరితో సమీక్షించినట్లు గవర్నర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు. తెలంగాణ సర్కారు కరోనా నియంత్రణలో విఫలం అయిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ గవర్నర్ నేరుగా రంగంలోకి దిగి ఇలా సమావేశం నిర్వహించటం కీలక పరిణామంగా మారింది. రాష్ట్రంలో కరోనా ను ఎదుర్కొనేందుకు సహకరించటంతోపాటు మౌలికసదుపాయాలు మెరుగుపర్చేందుకు సూచనలుచేయాల్సిందిగా ఆమె ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులను కోరారు.

గవర్నర్ తో సమావేశంలో నగరానికి చెందిన పదకొండు ప్రముఖ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా వైరస్ బాధితుల నుంచి అధిక ఛార్జీల వసూలు, బెడ్స్ కొరత వంటి సమస్యలు లేకుండా చూడాలని ఆమె కోరారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో వైద్య మౌలికసదుపాయాలు మెరుగుపర్చేందుకు పక్కాగా ప్రణాళికలు అందజేయాలని కోరారు. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందు ఆక్సిజన్ బెడ్స్ తోపాటు వెంటిలేటర్స్ సంఖ్యను కూడా పెంచాలని కోరారు. అందుబాటులో ఉన్న బెడ్స్ తోపాటు ఆస్పత్రిలో చేర్చుకునే ముందే వైద్య సేవలకు అయ్యే వ్యయం, భీమా వర్తింపు తదితర అంశాలపై పేషంట్లకు స్పష్టత ఇవ్వాలన్నారు.

Next Story
Share it