Telugu Gateway
Politics

ముఖ్యమంత్రి కన్పించకపోతే ఇబ్బంది ఏంటి?

ముఖ్యమంత్రి కన్పించకపోతే ఇబ్బంది ఏంటి?
X

తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, వీహెచ్ లు కరోనాను జయించి సంతోషంగా ఉన్నారని తెలిపారు. కరోనా పెద్ద భయంగా చిత్రీకరించారని తలసాని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ లో లాక్ డౌన్ పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని తెలిపారు. ముఖ్యమంత్రి కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే ఇబ్బంది ఏంటి అని తలసాని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు పనికిరాని దద్దమ్మల్లాగా, చెత్తలాగా తయారయ్యాయని ఆరోపించారు.

‘ప్రభుత్వం నడుస్తోంది కదా?. గవర్నమెంట్ స్కీములేమైనా అగాయా?. హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలంటే బండి సంజయ్ వెళ్లి మోదీకి చెప్పాలి. బీజేపీ వాళ్లు గాలిమీద మాట్లాడితే ఎట్లా? ప్రధానిని టార్గెట్ చేయలాంటే ఎంతసేపు?. చప్పట్లు ఎందుకు కొట్టించారు, దీపాలు ఎందుకు వెలిగించారని మేం కూడా మాట్లాడగలం. కరోనా సమయంలో బాధ్యతగా మాట్లాడాలి. ఎంఐఎం, టిఆర్ఎస్ కలిసినందుకే తెలంగాణలో కరోనా పెరుగుతోందని మాట్లాడడం ఎంత సిగ్గుచేటు . గాలిపై మాట్లాడితే గాలిలోనే కొట్టుకుపోతారు.’ అని తలసాని మండిపడ్డారు..

Next Story
Share it