Telugu Gateway
Cinema

సుమలతకు కరోనా పాజిటివ్

సుమలతకు కరోనా పాజిటివ్
X

ప్రముఖ నటి, ఎంపీ సుమలత కరోనా వైరస్ బారినపడ్డారు. గొంతు నొప్పి, తలనొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నాను. సోమవారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులు వెల్లడంచానని తెలిపారు.

వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సుమలత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి, పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తన నియోజక వర్గంలోని ప్రజలకు పలుమార్లు సుమలత కరోనా పై అవగాహన కల్పించారు.

Next Story
Share it