కొత్త సచివాలయ నిర్మాణం..జోక్యానికి సుప్రీం నో
BY Telugu Gateway17 July 2020 12:18 PM IST

X
Telugu Gateway17 July 2020 12:18 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. తెలంగాణలో సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని..కొత్త సచివాలయ నిర్మాణం ప్రభుత్వ విధానం నిర్ణయం అని పేర్కొంది. జీవన్ రెడ్డి పిటీషన్ ను డిస్మిస్ చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన త్రిసభ్య ధర్మసనం ఈ కేసును విచారణ చేపట్టింది. ఈ అంవంపై ఇప్పటికే హైకోర్టు సమగ్ర విచారణ జరిపినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
Next Story