Telugu Gateway
Politics

రాజస్ధాన్ హైకోర్టులో పైలట్ వర్గానికి ఊరట

రాజస్ధాన్ హైకోర్టులో పైలట్ వర్గానికి ఊరట
X

రాజస్థాన్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు వేయాలని ప్రయత్నించిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈ కేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలని కోరిన సచిన్ పైలట్ వాదనతో రాజస్థాన్ హైకోర్టు ఏకీభవించింది. అనంతరం కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది. అప్పటివరకూ సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు వేయటానికి అవకాశం ఉండదు. సచిన్ పైలట్ వర్గీయులు అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన సిఎల్పీ సమావేశానికి హాజరు కాకపోవటంతో స్పీకర్ కు ఫిర్యాదు చేయించి వీరికి నోటీసులు జారీ చేయించారు.

పార్టీ సమావేశానికి విప్ వర్తించదని..సభలో జరిగే వాటికి మాత్రమే విప్ వర్తిస్తుందని పైలట్ వర్గీయులు వాదించారు. హైకోర్టు నిర్ణయంపై రాజస్థాన్ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా ఊరట లభించలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతే తాము స్పీకర్ లేవనెత్తిన అంశాలు అన్నింటిపైనా విచారణ జరుపుతామని ప్రకటించింది. దీంతో శుక్రవారం నాడు రాజస్ధాన్ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేయటంతో ఈ అనిశ్చితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కన్పిస్తోంది.

Next Story
Share it