రాజమౌళికి కరోనా పాజిటివ్
BY Telugu Gateway29 July 2020 9:17 PM IST
X
Telugu Gateway29 July 2020 9:17 PM IST
ప్రముఖ దర్శకుడు రాజమౌళితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం తనతోపాటు తన కుటుంబ సభ్యులకు కొద్దిపాటి జ్వరం వచ్చి..తర్వాత తగ్గిపోయిందని తెలిపారు. అయినా సరే కరోనా టెస్ట్ లు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా తేలిందని వెల్లడించారు.
డాక్టర్ల సూచనల మేరకు తాము హోం క్వారంటైన్ లో ఉన్నామని తెలిపారు. తమకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాము యాంటీబాడీలు డెవలప్ అయ్యేంత వరకూ ఎదురుచూస్తామని..తర్వాత ప్లాస్మా దానం చేస్తామని వెల్లడించారు.
Next Story