Top
Telugu Gateway

కరోనాపై ఈ దొంగలెక్కలేంటి?

కరోనాపై ఈ దొంగలెక్కలేంటి?
X

తెలంగాణ సర్కారు కరోనా లెక్కలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కరోనా కేసులకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. నిన్న (గురువారం) మొత్తం కేసులు 18570 అని హెల్త్ బులిటెన్ లో చూపించారు.

లైవ్ డ్యాష్ బోర్డ్ లో మాత్రం 21393 అని చూపిస్తుంది. హెల్త్ బులిటెన్ కు వాస్తవాలకు దాదాపు 3000 కేసుల తేడా ఉంది. కరోనా వాస్తవాలు తెలుసుకోవాలి అని ప్రజలు అనుకుంటున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ కరోనా వాస్తవ లెక్కలు చెప్పండి’. అని రేవంత్ ట్వీట్ చేశారు.

Next Story
Share it