Telugu Gateway
Cinema

పవన్ కళ్యాణ్ ను మరీ కెలుకుతున్న వర్మ!

పవన్ కళ్యాణ్ ను మరీ కెలుకుతున్న వర్మ!
X

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీరు చూస్తుంటే ‘పవర్ స్టార్’ సినిమా ద్వారా ఎంత వీలైతే అంత రచ్చ చేయటానికి సిద్ధపడినట్లు కన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఈ సినిమాకు సంబంధించి చేస్తున్న ప్రకటనలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఆదివారం నాడు పవర్ స్టార్ సినిమాకు సంబంధించి మరో వివాదస్పద పోస్టర్ ను విడుదల చేశారు. ఓ పాట విడుదలకు సంబంధించి పైన పవర్ స్టార్ టైటిల్ ..కింద గడ్డి తింటావా అనే పాట విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ లో పవర్ స్టార్ అనే టైటిల్ పవన్ కళ్యాణ్ కే ఉందనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అంతే కాదు..అచ్చం పవన్ కళ్యాణ్ పోలికలు ఉన్న వ్యక్తినే పెట్టి ఆయన పేరు ‘ప్రవణ్ కళ్యాణ్’ అంటూ పరిచయం చేశారు. టైటిల్ లోనే ఇది ఆయన ఎవరిని టార్గెట్ చేశారో అర్ధమైపోతుంది. అంతే కాదు..టైటిల్ మధ్యలో జనసేన పార్టీ గుర్తు గ్లాస్ పెట్టడం, రష్యా భార్య, ఫాం హౌస్, ఎన్నికల తర్వాత అంటూ అన్ని లింక్ చేస్తూ కావాల్సినంత వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వర్మను పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే నానా బూతులు తిడుతున్నా ఆయన ఏ మాత్రం వెనక్కు తగ్గగా మరింత రెచ్చిపోతూ రోజుకొకటి విడుదల చేస్తూ మరింత వేడిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాదు..ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ ఓ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఈ సినిమా ట్రైలర్ చూడటానికి కూడా 25 రూపాయలు కట్టాలని..ప్రపంచ సినిమా చరిత్రలో ట్రైలర్ కు డబ్బులు వసూలు చేసిన సినిమా ఇదే అవుతుందని ప్రకటించారు. పవర్ స్టార్ ట్రైలర్ ను జులై 22న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పవర్ స్టార్ సినిమా జులై 25న ఉదయం పదకొండు గంటలకు విడుదల అవుతుందని..ఆర్టీజీ వరల్డ్ థియేటర్.కామ్ లో ఇఫ్పటికే అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ప్రారంభం అయ్యాయని తెలిపారు. వివాదాలతో క్యాష్ చేసుకోవటం టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మకు ‘సినిమా’తో పెట్టిన విద్యగా మారింది.

Next Story
Share it