ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
BY Telugu Gateway10 July 2020 11:01 AM IST
X
Telugu Gateway10 July 2020 11:01 AM IST
ప్రభాస్, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ పేరును ప్రకటించటం ఇదే మొదటిసారి. దీంతోపాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ప్రభాష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో ఆయన ఫ్యాన్స్ ఫుల్ కుషీకుషీగా ఉన్నారు. ఈ ఫోటో బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా రిచ్ లుక్ లో ప్రభాస్, పూజా హెగ్డే కన్పిస్తున్నారు.
జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటోంది. లాక్‌డౌన్‌కు ముందు 'రాధేశ్యామ్' జార్జియాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు.
Next Story