Telugu Gateway
Cinema

పవర్ స్టార్ ట్రైలర్ లో ‘గ్లాస్’ పగలగొట్టిన వర్మ

పవర్ స్టార్ ట్రైలర్ లో ‘గ్లాస్’ పగలగొట్టిన వర్మ
X

రామ్ గోపాల్ వర్మ ముందు చెప్పినట్లుగానే బుధవారం ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ఇది డబ్బులు పెట్టి చూడాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్ లోనే విడుదల చేశారు. ఇప్పటికే ఎవరైనా 25 రూపాయలు చెల్లిస్తే వాళ్లకు డబ్బు వెనక్కి ఇచ్చేస్తాని తెలిపారు. ఇక అసలు ట్రైలర్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ఎన్ని వివాదాలు పెట్టాలో అన్నీ ట్రైలర్ లోనే పెట్టేశారు. ట్రైలర్ లో చివరలో ‘గ్లాస్’ పగలగొట్టేసి ట్రైలర్ ను క్లోజ్ చేశారు. పవర్ స్టార్ టైటిల్ లోనే ఎన్నికల ఫలితాల తర్వాత అని పెట్టిన విషయం తెలిసిందే.

ట్రైలర్ అంతా ఎక్కువ శాతం రాజకీయాల చుట్టూనే తిరిగింది. ప్రవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఆ తర్వాత ఓ దర్శకుడిని లాగి పెట్టి కొట్టిన సీన్...ఇంట్లో టీవీ పగలగొట్టడం, ఒకప్పుడు పొత్తు పెట్టుకున్న పార్టీ నేతతో ‘మిమ్మల్ని నమ్మగూడదని చాలా మంది చెప్పారు. కానీ నమ్మాను ’ అంటూ డైలాగ్, ఓ నిర్మాత ఫాంహౌస్ లో ప్రవన్ కళ్యాణ్ తో చెప్పే డైలాగ్ లతో ట్రైలర్ నింపేశారు. ఈ సినిమా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీశారనే విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాను ప్రవణ్ కళ్యణ్ అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు వర్మ. జులై 25న సినిమా విడుదల కానుంది.

https://www.youtube.com/watch?time_continue=2&v=MSY3qqh4K3I&feature=emb_logo

Next Story
Share it