Telugu Gateway
Politics

కెసీఆర్, జగన్ లకు ప్రధాని మోడీ ఫోన్

కెసీఆర్, జగన్ లకు ప్రధాని మోడీ ఫోన్
X

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తోంది. ఏపీలో పెద్ద ఎత్తున టెస్ట్ లు చేస్తుండటంతో అక్కడ కేసుల సంఖ్య కూడా అంతే స్థాయిలో భయంకరంగా పెరుగుతోంది. ఆదివారం నాడు ఏకంగా ఏపీలో 5041 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి. అదే తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య ఇంకా ఊపందుకోలేదు. అయినా చేసిన పరీక్షల్లో కూడా పాజిటివ్ రేటు ఎక్కువగా ఉంటుంది.

దేశంలోనే ప్రమాదకర పరిస్థితులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్ లతో ఫోన్ లో మాట్లాడారు. ముఖ్యంగా కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై వీరు చర్చించినట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు అసోం ముఖ్యమంత్రి సోనోవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ,ఉత్తరాఖండ్ సీఎం రావత్ లతో కూడా ఆయన మాట్లాడారు.

Next Story
Share it