Telugu Gateway
Telangana

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ఖాళీ

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ఖాళీ
X

ఉస్మానియా ఆస్పత్రి విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆస్పత్రి వార్డుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరటం, డాక్టర్లతో పాటు పేషంట్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొత్త భవనం నిర్మాణాల విషయంలో జాప్యం కావటానికి ప్రతిపక్షాలే కారణం అని అధికార పార్టీ ఎదురుదాడి చేసింది. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా సర్కారు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎంఈ రమేష్‌రెడ్డి ఆదేశించారు.

శిథిలావస్థకు చేరిన పాత భవనానికి తాళం వేసి సీల్‌ వేయాలన్నారు. ఓల్డ్‌ బ్లాక్‌లోని డిపార్ట్‌ మెంట్లను వేరేచోటకి మార్చాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో పాత భవనంలోని పేషెంట్లను పక్క భవనంలోకి తరలించనున్నారు. మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని సీల్‌‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Next Story
Share it