Telugu Gateway
Cinema

సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు

సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు
X

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసులో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని నివేదికలు అందినా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ పలువురి నుంచి వస్తోంది. అంతే కాదు..సుశాంత్ మరణం బాలీవుడ్ లో బంధుప్రీతికి సంబంధించి పెద్ద దుమారమే రేపుతోంది. ఈ తరుణంలో సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కృష్ణకుమార్‌ సింగ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆయన చేసిన ఫిర్యాదు ఆధారంగా సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తిపై పాట్నాలోని రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

కేకే సింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు రియాతో పాటు, మరో ఐదుగురి మీద కూడా పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో నలుగురు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఈ కేసుపై విచారణ జరిపేందుకు ముంబయ్ కు పంపారు. మరోవైపు రియా చక్రవర్తి కూడా సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఆమె సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి కూడా చేశారు. అంతేకాకుండా సుశాంత్‌తో తన జ్ఙాపకాలను పలుమార్లు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Next Story
Share it