గవర్నర్ కోటా ఎమ్మెల్సీల గెజిట్ జారీ
BY Telugu Gateway28 July 2020 7:53 PM IST

X
Telugu Gateway28 July 2020 7:53 PM IST
ఏపీ శాసన మండలికి ఇద్దరు కొత్త సభ్యులు వచ్చారు. గవర్నర్ కోటాలో తాజాగా ఏపీ మంత్రిమండలి జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసింది. ఈ పేర్లకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కె. విజయానంద్ మంగళవారం నాడు గెజిట్ జారీ చేశారు. ఇప్పటికే ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
అయితే కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మారిన పరిస్థితుల్లో ఏపీ సర్కారు మండలి రద్దు తీర్మానం అమలు కోసం ఒత్తిడి తెచ్చే ఆలోచనను పూర్తిగా విరమించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే గవర్నర్ కోటాలో భర్తీ చేసే సీట్లను ఒకటి మైనారిటీ వర్గానికి, మరోకటి ఎస్సీ వర్గానికి కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story