నాగశౌర్య షాకింగ్ లుక్
BY Telugu Gateway27 July 2020 2:09 PM GMT
X
Telugu Gateway27 July 2020 2:09 PM GMT
ఇప్పటివరకూ చూసింది ఒకటి. ఇక నుంచి చూసేది మరొకటి అన్నట్లు ఉంది హీరో నాగశౌర్య కొత్త లుక్. ఈ న్యూలుక్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సంతోష్ జాగర్లమూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా నాగశౌర్యకు 20వ చిత్రం. ఈ సినిమా కోసం నాగశౌర్య తన లుక్ మార్చుకున్న తీరు చూసి తనకు ఆశ్చర్యమేసిందని శేఖర్ కమ్ముల వ్యాఖ్యానించారు. ఈ సినిమాను వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నారాయణదాస్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నాగశౌర్య తన రూట్ మార్చినట్లు కన్పిస్తోంది.
Next Story