‘మర్డర్’ మూవీ ట్రైలర్ విడుదల
పవర్ స్టార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చి నాలుగు రోజులు అయిందో లేదో రామ్ గోపాల్ వర్మ మరో సినిమా విడుదల చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఆయన మంగళవారం నాడు ‘మర్డర్’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. నల్లగొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో మాటలేం లేకుండా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే చూపించారు.
పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి అనే టైటిల్స్ తో సాగింది ఈ ట్రైలర్. ఈ సినిమాలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర రచనా, దర్శకత్వం వహిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=evaH2L-7NRQ