Telugu Gateway
Cinema

‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ న్యూలుక్

‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ న్యూలుక్
X

అక్కినేని అఖిల్, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాకు సంబంధించిన న్యూ లుక్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. అంతే కాదు..సినిమా విడుదల కూడా సంక్రాంతికి ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త లుక్ లో అఖిల్ ల్యాప్ టాప్ లో పనిచేసుకుంటుంటే..వెనక కుర్చీలో కూర్చున్న పూజా హెగ్డే కాలితో అఖిల్ చెవితో ఆడుకునే సీన్ చూడొచ్చు.

'బొమ్మ‌రిల్లు' భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, వాసు వ‌ర్మ నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను వేస‌వికి, ఆ త‌ర్వాత ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌ద్దామనుకున్నారు. కానీ ప‌రిస్థితులు ఇప్పుడప్పుడే స‌ర్దుకునేలా లేక‌పోవ‌డంతో వ‌చ్చే ఏడాదికే రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

Next Story
Share it