Telugu Gateway
Telangana

ఆంక్షల నడుమ సచివాలయంలో మీడియాకు అనుమతి

ఆంక్షల నడుమ సచివాలయంలో మీడియాకు అనుమతి
X

తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు సర్కారు సోమవారం సాయంత్రం మీడియాను అనుమతించింది. అది కూడా ఎన్నో ఆంక్షల మధ్య. మీడియా సిబ్బందిని మినీ బస్సులు, వ్యానుల్లో తీసుకెళ్లారు. ఏ మాత్రం కోవిడ్ 19 నిబంధనలు పాటించకుండా మీడియా సిబ్బందిని, పోలీసులను ఒకే వ్యానుల్లో, బస్సుల్లో తీసుకెళ్ళారు. బౌతికదూరం సంగతి పూర్తిగా మర్చిపోయారు. కూల్చివేతల దగ్గర కూడా మీడియా ప్రతినిధులు స్వేచ్చగా తిరిగి ఫోటోలు, వీడియోలు తీసుకునే వెసులుబాటును ఏ మాత్రం కల్పించలేదు. ఆంక్షల మధ్యే ఈ వ్యవహారం అంతా సాగింది. కూల్చివేతల ప్రక్రియ రికార్డింగ్ కు కూడా అతి తక్కువ సమయం కేటాయించారు.

పోలీసు అధికారులు ఎక్కడికి అక్కడ రోప్ లు కట్టి మీడియా ప్రతినిధులు తాము గీసిన గీతలు దాటకుండా ఆంక్షలు పెట్టారు. సచివాలయంలో పలు బ్లాక్ లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. మరికొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా ఒకట్రెండు రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది. కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ సర్కారు మీడియాను అనుమతించటం లేదని హైకోర్టులో కేసు ఉండటంతో సర్కారు ఈ మాత్రం అయినా అవకాశం ఇచ్చింది.

Next Story
Share it