Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో మహీంద్రా యూనివర్శిటీ ప్రారంభం

హైదరాబాద్ లో మహీంద్రా యూనివర్శిటీ ప్రారంభం
X

భారత్ లో ప్రపంచ శ్రేణి ప్రమాణాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను అందించేందుకు మహీంద్రా గ్రూప్ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ సంస్థ హైదరాబాద్‌లో దాదాపు 130 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన యూనివర్శిటిని శుక్రవారం నాడు ప్రారంభించింది. తెలంగాణ పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖ లమంత్రి కెటీఆర్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహీంద్రా గ్రూప్ ప్రతినిధులు వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ బహుళ నైపుణ్యాల క్యాంపస్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ కోర్సులను అందించనుంది. ఎంయులో 2014లో ప్రారంభించిన ఈకోల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కూడా భాగం కానుంది. తక్షణ రోడ్‌మ్యాప్‌లో భాగంగా, యూనివర్శిటీ ఇప్పుడు స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (2021–22), స్కూల్‌ ఆఫ్‌ లా (2021–22), ఇందిరా మహీంద్రా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (2021–22), స్కూల్‌ ఆఫ్‌ మీడియా అండ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ (2022–23) మరియు స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ (2023–24) ప్రారంభించనుంది.

పూర్తి స్థాయి అటానమస్ యూనివర్శిటీగా మహేంద్రా యూనివర్శిటి ఉండనుంది. టెక్‌ మహీంద్రా ఎండీ అండ్‌ సీఈవో, మహీంద్రా యూనివర్శిటీ బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సీ.పి.గుర్నానీ మాట్లాడుతూ ‘‘ నైపుణ్య ఖాళీని పూరించడంతో పాటుగా శక్తివంతమైన మార్కెట్‌ అవసరాలు మరియు వ్యాపార వాతావరణానికి అనుగుణంగా తమను తాము మార్చుకోవడంతో పాటుగా ఆ మార్పును స్వీకరించడం మరియు రూపాంతరం చెందే అంతర్జాతీయ నాయకులను సృష్టించాలనే మా నిబద్ధతకు నిదర్శనంగా మహీంద్రా యూనివర్శిటీ నిలుస్తుందని తెలిపారు.

ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ మరియు ఎమోషనల్‌ ఇంటిలిజెన్స్‌ యొక్క శక్తిపై ఆధారపడి బహుళ నైపుణ్యాలు కలిగిన అభ్యాసాన్ని సైతం ఈ యూనివర్శిటీ అందిస్తుంది. సమాజం ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి వీలుగా విద్యార్థులకు నూతన తరపు పోటీతత్త్వం పెంచడం మరియు వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించడానికి ఇది సహాయపడనుంది’’ అని అన్నారు. రాబోయే ఐదేళ్లలో మహీంద్రా యూనివర్శిటీలోని పలు స్కూల్స్‌ లో 300కు పైగా ఫ్యాకల్టీ సభ్యులు, 4వేల మంది విద్యార్థులు ఉండనున్నారని అంచనా. మహీంద్రా యూనివర్శిటీ ప్రారంభోత్సవం సందర్భంగా కెటీఆర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక మహీంద్రా గ్రూప్‌ మద్దతునందిస్తున్న మహీంద్రా యూనివర్శిటీ ఖచ్చితంగా భవిష్యత్‌లో సిద్ధంగా ఉన్న ప్రతిభావంతుల అవసరాలను తీర్చనుందని తెలిపారు.

Next Story
Share it