Telugu Gateway
Politics

నీరా కేఫ్ కు శంకుస్థాపన చేసిన కెటీఆర్

నీరా కేఫ్ కు శంకుస్థాపన చేసిన కెటీఆర్
X

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ నీరా కేఫ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు నీరా ను టేస్ట్ చేశారు. ఈ సందర్భంగా కెటీఆర్ మాట్లాడుతూ గౌడ్ ల అస్తిత్వానికి ప్రతీకగా నీరా కేఫ్ ఉంటుందని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ తోపాటు .. మరుగున పడిన వృత్తి నిపుణునలను కాపాడుకోవాలన్నారు. గీత వృత్తి పై రెండులక్షల పైగా ఆధారపడి ఉన్నారని తెలిపారు. గీత వృత్తి పై ఉన్న వారికి 16కోట్లు పన్నును రద్దు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఈ నీరా కేఫ్ ఆరంభం మాత్రమే .. భవిష్యత్ లో ఎన్నో లాభాలు వస్తాయని తెలిపారు.

ప్రతి వృత్తిలో అందరు సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. నేత , గీత , గొల్ల , ముదిరాజ్ ఇలా ప్రతి వృత్తిని కాపాడుకోవడమే లక్ష్యం అని తెలిపారు. మరో మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ ఎన్నో కులాలకు గీత వృత్తి మూలాధారంగా ఉందన్నారు. దశాబ్దాలనుండి గీత వృత్తిపై ప్రభుత్వాలు పన్నులు వసూలు చేశాయి. గీత వృత్తికి పన్ను, బకాయిలను రద్దుచేసిన ఘనత కేసీఆర్ దే అని తెలిపారు. కల్తీకల్లు ను దూరం చేసేందుకు హరితహారంలో ఈత వనాలను పెంచుంతుందని తెలిపారు. గొప్ప ఆరోగ్య పానీయం నీరా అన్నారు. కేసీఆర్ తరవాత మనసున్న నాయకుడు కేటీఆర్ వందల కోట్ల విలువైన భూమి నీరా కేఫ్ స్టాల్ కు ఇచ్చారన్నారు.

Next Story
Share it