Telugu Gateway
Politics

కెసీఆర్ ఈజ్ బ్యాక్

కెసీఆర్ ఈజ్ బ్యాక్
X

వెరీజ్ కెసీఆర్. మా ముఖ్యమంత్రి ఎక్కడ? మాకు తెలుసుకునే హక్కు ఉంది. సీఎం కెసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వివిధ వర్గాల నుంచి వెలువడిన డిమాండ్లు ఇవి. తెలంగాణలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే సీఎం ఎక్కడికి పోయారు అంటూ తెలంగాణలో విపక్షాలు అన్నీ ప్రశ్నలు సంధించాయి. అయితే అధికార పార్టీ మాత్రం అసలు విషయం చెప్పకుండా కెసీఆర్ ఎక్కడ ఉంటే మీకెందుకు? ఏ పనైనా ఆగిందా?. ఏ స్కీమ్ అయినా నిలిచిపోయిందా అంటూ ఎదురుదాడికి దిగారు. చివరకు హైకోర్టులోనూ కెసీఆర్ ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ పిటీషన్ దాఖలు అయితే..దీనిపై కోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

గత కొన్ని రోజులుగా ఫాంహౌస్ కే పరిమితం అయిన ముఖ్యమంత్రి కెసీఆర్ శనివారం సాయంత్రం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. అంతే కాదు..ఆయన శనివారం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు కూడా. దీంతో వెరీజ్ కెసీఆర్ సోషల్ మీడియా ట్రోలింగ్ కు ఇక తాత్కాలిక బ్రేక్ పడినట్లే. ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, అనుమానితులకు కూడా టెస్ట్ లు చేసే పరిస్థితి లేకపోవటం వల్ల ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతోపాటు ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాల విషయంలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సర్కారు తాజాగా ర్యాపిడ్ టెస్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story
Share it