Telugu Gateway
Politics

సీఎం వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా?

సీఎం వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా?
X

ఎవరైనా సెక్షన్ 8 అంటే నాలుక చీరేస్తాం..శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్, బిజెపి నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. సొంత గడ్డకు ద్రోహం చేయటమే వారి పనిగా ఉందని..అడ్డుకోవటం తప్ప వాళ్లకు ఏమీ చేతకాదన్నారు. మంత్రి బుధవారం నాడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పర్యావరణ నిబంధనల ప్రకారమే కొత్త సచివాలయ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కొత్త సచివాలయం నిర్మాణమయ్యాక కాంగ్రెస్ నేతల పిల్లలే అక్కడ సెల్ఫీలు దిగుతారని వ్యాఖ్యానించారు. సీఎం కెసిఆర్ తెలంగాణ గడ్డ మీద నుంచే పాలిస్తున్నారు ..సీఎం వ్యవసాయ క్షేత్రం అమరావతి లో ఉందా ? అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ పై లేని రాద్ధాంతం కొత్త సచివాలయం పై ఎందుకన్నారు. పాత సచివాలయం పాడుబడ్డది ..అందులోనే సంసారం చేయాలా అని ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణం వద్దనే వారు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టేనని, .హై కోర్టు తీర్పు కోసం ఏడాది ఓపిక పట్టామని తెలిపారు.

సచివాలయ నిర్మాణానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కూడా మతి లేని మాటలు ఎందుకన్నారు. ‘తెలంగాణ కాంగ్రెస్ ,బీజేపీ నేతలు ఆంధ్రా నేతల్లా మాట్లాడుతారా?. .అందరి నిజస్వరూపాలు సెక్షన్ 8 పై వారి మాటల ద్వారా బయటపడ్డాయి. ఎవరైనా సెక్షన్ 8 అంటే నాలుక చీరేస్తాం. తెలంగాణ అస్తిత్వం పై రాజీ పడేది లేదు. మా తెలంగాణ పై ఇతరుల పెత్తనం సహించేది లేదు. బానిస తెలంగాణ ను అనుమతించం. అపుడు పోరాటం చేశాం ..ఇపుడు ప్రాణాలకు తెగించి అయినా పరాయి మనస్తత్వ బానిస నేత ల పై పోరాడతాం. ఉత్తమ్ ఏనాడూ తెలంగాణ కోసం పోరాడ లేదు ..ఆయన నైజం సెక్షన్ 8 పై మాట్లాడటం తో బయట పడింది. కాంగ్రెస్ ,బీజేపీ నేతల వల్లే తెలంగాణ ఏడు మండలాలు కోల్పోయింది. సచివాలయ నిర్మాణం తో ప్రజా ధనం వృధా కాదు. కెసిఆర్ ఎక్కడుంటే ఏమిటీ ?ఏ పథకమైనా ఆగిందా ?ఆసరా పెన్షన్లు ,రైతు బంధు ఆగిందా ?. తెలంగాణ కు కొత్త సచివాలయం ఓ ప్రతీక గా మారబోతోంది. వంద సంవత్సరాల పాటు కొత్త సచివాలయం తెలంగాణ పాలనా అవసరాలను తీర్చ బోతోంది.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it