మంగళగిరి జర్నలిస్టులకు నారా లోకేష్ బీమా

X
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి పరాజయం పాలైన మంగళగిరి నియోజకవర్గంలోని జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించారు. 62 మంది జర్నలిస్టులు ఇందులో కవర్ కానున్నారు. సహజ మరణానికి 10లక్షలు, ప్రమాదమైతే 20 లక్షలకు బీమా వచ్చేలా పాలసీలు తీసుకున్నారు. కోవిడ్ మరణాలకూ వర్తించేలా బీమా ప్రీమియంలు చెల్లింపులు చేశారు. ఇన్సూరెన్స్ పత్రాలను ఆయా జర్నలిస్టులకు అందజేయనున్న టీడీపీ. జులై 15 నుంచి అమలులోకొచ్చేలా బీమా తీసుకున్న లోకేష్.
Next Story



