బిజెపిలో చేరటం లేదు..సచిన్ పైలట్
BY Telugu Gateway15 July 2020 11:01 AM IST

X
Telugu Gateway15 July 2020 11:01 AM IST
కాంగ్రెస్ నుంచి వేటుకు గురైన రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. తాను బిజెపిలో చేరటం లేదన్నారు. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇప్పుడు రాజేష్ పైలట్ తోపాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఏమి చేస్తారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీంతో రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడతారానే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఆయన అధికారికంగా దీనిపై ప్రకటన చేసే వరకూ ఈ సస్పెన్స్ కొనసాగనుంది.
Next Story



