హైదరాబాద్ మేయర్ బొంతు కు కరోనా పాజిటివ్
BY Telugu Gateway26 July 2020 5:41 PM IST
X
Telugu Gateway26 July 2020 5:41 PM IST
తెలంగాణలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే మొదటి నుంచి జీహెఛ్ఎంసీనే. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టుగా తేలింది.
రామ్మోహన్ కుటుంబ సభ్యులకు మాత్రం కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో మేయర్ బొంతు రామ్మోహన్ హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతన్నారు. కొద్ది రోజుల కిందట మేయర్ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చింది.
Next Story